మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నవదీప్‌కు 41ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నేడో, రేపో నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన విచారణకు హాజరుకాకుంటే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నవదీప్‌తో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది.డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు కూడా వినిపించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా చూడాలని నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు విచారణకు సహకరించాలని నవదీప్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీసులకు సూచించింది.

Previous article అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం…నారా లోకేశ్
Next articleబాలకృష్ణకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్….కోటంరెడ్డి, అనగాని సస్పెన్షన్