మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు. ఈ దాడికి సంబంధించి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై మిరుదొడ్డి మండలంలోని చెప్యాల గ్రామానికి చెందిన 38 ఏళ్ల గడ్డం రాజు కత్తితో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఎంపీకి గాయాలయ్యాయని, ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి గజ్వేల్ ఆసుపత్రికి తరలించారని, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.