జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ది ధైర్యం అనుకుంటారని, కానీ అది పిచ్చ అని వ్యాఖ్యానించారు. జగన్ మానసిక స్థితి బాగాలేదని, కేంద్రం ప్రత్యేక మానసిక వైద్యులను పంపించాలని వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ ఇవాళ మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ మానసిక స్థితి బాగా లేదని ఏ డాక్టర్ ను అడిగినా ఇదే చెబుతారని అన్నారు. 

“ఇంట్లోంచి బయటికి రాలేడు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు, ఆఖరికి నన్ను తిట్టాలన్నా కూడా పేపర్ పదిసార్లు చదివి తిడతాడు. జపాన్ ప్రభుత్వాన్ని కూడా ఇరిటేట్ చేయగలిగిన మహానుభావుడు జగన్” అని ఎద్దేవా చేశారు. 

ఇక జగన్ చాలా క్రూరమైన వ్యక్తి అని అతడి సన్నిహితులు తనకు చెప్పారని పవన్ వెల్లడించారు. అయితే, గడాఫీ, సద్దాం హుస్సేన్ వంటివారు కూడా ఇలానే అనుకున్నారు… కానీ వాళ్లు ఏమయ్యారో మీకు తెలుసు అని వ్యాఖ్యానించారు.