టాలీవుడ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. నిఖిల్ భార్య పల్లవి గర్భవతి అంటూ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై నిఖిల్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నిఖిల్ భార్య పల్లవి ఒక డాక్టర్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2020లో కోవిడ్ మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో వీరు కరోనా నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని ఇద్దరూ ఖండించారు. ఇక సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం ‘స్వయంభు’ చిత్రం షూటింగ్ లో నిఖిల్ బిజీగా ఉన్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం కత్తిసాము వంటి యుద్ధ విద్యల్లో కూడా నిఖిల్ శిక్షణ పొందాడు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.