టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో స్పీడ్ పెరిగింది. మరింత ఉత్సాహంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఈరోజు టీడీపీలో అధికారికంగా చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.