ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారును తాను ఎందుకు కలిసిందీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వివరణ ఇచ్చారు. నిన్న సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కలిసిన విషయం తెలిసిందే. శుక్రవారం మల్లారెడ్డి తన తనయుడు భద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ను కలిశారు.

తన అల్లుడు రాజశేఖరరెడ్డి కాలేజీకి చెందిన భవనాల కూల్చివేతకు సంబంధించి వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు కేటీఆర్‌కు తెలిపారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కాగా, గతంలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తన తనయుడు మల్కాజిగిరి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని చెప్పారు. అయితే ఈ రోజు తాను పోటీ చేయడం లేదని భద్రారెడ్డి పార్టీ అగ్రనేతకు స్పష్టం చేశారు.