నన్ను గదిలో తీసుకెకెళ్ళి ఫోన్ లో వీడియో చూడామని బలవంతం చేశాడు.– నటి మిను మునీర్

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. నటి మిను మునీర్, హీరో జయసూర్య సహా పలువురు ప్రముఖులపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, తాజాగా దర్శకుడు బాలచంద్ర మీనన్ పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

మిను మునీర్ తన సోషల్ మీడియా ద్వారా, 2007లో బాలచంద్ర మీనన్ తన గదికి పిలిపించి, అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేయడంతో పాటు, తనకు తోడుగా ఉండమని అడిగారంటూ ఆరోపణలు చేసింది. ఆమె వెంటనే ఆ గదిని విడిచి వెళ్లిపోయిందని వెల్లడించింది.

మిను మునీర్ ఆ సంఘటన తర్వాత బాలీవుడ్‌లో పలు ఇబ్బందులు ఎదుర్కొని, ప్రస్తుతం చెన్నైలో తమిళ సినిమాల్లో నటిస్తూ ఉంటున్నానని వెల్లడించింది.

జస్టిస్ హేమ కమిటీ నివేదికపై చర్చలు

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ గతంలో ఓ నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమునరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను విశ్లేషించారు.

also Read : పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన జానీ మాస్టర్..!

ప్రస్తుతం ఈ నివేదిక ఇండస్ట్రీలో ప్రధాన చర్చా విషయం అయింది. కర్ణాటక ఫిల్మ్ చాంబర్ కూడా తాజాగా మహిళా వేదికలను ఏర్పాటు చేసి, మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కృషి చేస్తోంది. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎన్ ఎం సురేష్ మాట్లాడుతూ, ఈ మీటింగ్ ను కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామని, చిత్ర పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకొని, వారి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చర్చించినట్లు తెలిపారు.

హేమ కమిటీ నివేదిక ప్రభావం

ఏడు సంవత్సరాల శ్రమతో జస్టిస్ హేమ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. దీనికి ధైర్యం తీసుకుని పలువురు అగ్ర నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల విషయాలను బహిరంగంగా ప్రకటించడం ప్రారంభించారు.

హేమ కమిటీ నివేదిక అనంతరం, అన్ని పరిశ్రమల్లో కూడా ఈ అంశం గురించి చర్చలు జరగడం మొదలైంది. ఈ నివేదిక సారాంశం ప్రకారం, మహిళలు తమ హక్కులను రక్షించుకోవడానికి మరింత ముందుకు రావాలని సూచించారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.

తాజా వార్తలు