మ‌హారాష్ట్ర యుగ‌క‌విగా, ద‌ళిత సాహిత్య చ‌రిత్ర‌లో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే 103వ జ‌యంతి వేడుక‌ల్లో బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. సాఠే చిత్ర‌పటంతో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌హాత్మా జ్యోతిబా ఫూలేతో పాటు ప‌లువురు మ‌హానీయుల‌కు కేసీఆర్ నివాళుల‌ర్పించారు. వాటేగావ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొన్నారు. అంత‌కు ముందు కొల్హాపూర్‌లోని మ‌హాలక్ష్మీ అమ్మ‌వారి దేవాల‌యంలో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వేద పండితులు కేసీఆర్‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. కొల్హాపూర్ చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్, దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మ‌రికాసేప‌ట్లో ఇస్లాపూర్‌లోని రఘునాథ్‌ దాదాపాటిల్‌ నివాసానికి కేసీఆర్ చేరుకుంటారు. కొల్హాపూర్‌లోని సాధు మహారాజ్‌ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. నాగాల పార్క్‌లోని పూధరి న్యూస్‌పేపర్‌ యజమాని ఇంటికి వెళ్తారు. సాయంత్రం 5.40 గంటలకు కొల్హాపూర్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.