యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నానని ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ పాల్ తెలిపారు. కేటీఆర్ ను తొలిసారి కలిశానని, తనతో ఆయన హృదయపూర్వకంగా మాట్లాడారని చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అద్భుతమైన ఆయిల్ తో ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తానని తెలిపారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరని… కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించడం శుభపరిణామమని అన్నారు. త్వరలోనే కేసీఆర్ అద్భుతమైన స్వస్థత పొందుతారని, గతంలో కంటే యాక్టివ్ గా ఉంటారని చెప్పారు.