పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఇది ఊరటనిచ్చే విషయమే. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ, వైసీపీలను గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వాటి గుర్తులతో కొనసాగించగా, జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది. 

గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉన్న ఆర్ఎల్‌డీని రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చినప్పటికీ దానికి గుర్తును రిజర్వు చేయలేదు. ఇక, కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉండేది. ఆ పార్టీ కొత్త పేరు, వివరాలతో ఏపీఎస్ఈసీ వద్ద రిజిస్టర్ చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో చేర్చి కారు గుర్తు కొనసాగించనుంది.