తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు మరో విడత డీఏను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్‌లోని 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను చెల్లించనున్నట్లు వెల్లడించారు.క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు ఎనిమిది డీఏలను మంజూరు చేసినట్లు బాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, పెండింగ్‌ బకాయిలను త్వరలో ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందన్నారు.