పత్రికా రంగంలో అడుగుపెట్టి సంచనాలు నమోదుచేసి, ఆ రంగంపై చెరగని ముద్రవేసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రముఖ నటుడు రామ్‌చరణ్, దర్శకుడు శంకర్, సునీల్, రఘు కారుమంచి, యూనిట్ సభ్యులు నివాళులు అర్పించారు. 

వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. రామోజీ మరణ వార్త తెలిసిన వెంటనే చిత్ర బృందం అక్కడే రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రామోజీ మరణం తీరని బాధాకరమని, ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.