ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది.. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలోని కేబినెట్ లో టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్త్‌లు దక్కబోతున్నాయనే చర్చ సాగుతోంది అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతోది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారని ఓ నేషనల్ ఛానల్‌తో ఈ విషయాన్ని చెప్పినట్లు ఆదివారం సాయంత్రం స్క్రోలింగ్ నడిచింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రు ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయిన క్రమంలో ఆ ఛానల్ రిపోర్టర్‌ పవన్‌ కళ్యాణ్ తో మాట్లాడారు.. పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్లు వాళ్లు తెలియజేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం పవనే డిప్యూటీ సీఎం అంటూ టాక్ నడుస్తోంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారని కూడా కొందరు ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి.. ఆయనకు హోంశాఖ ఖాయమంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని తీసుకోబోతున్నారా?.. లేదా? అన్నది తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే