Home Breaking News కర్మ కాకపోతే ఇంకేంటి..?

కర్మ కాకపోతే ఇంకేంటి..?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేస్తాయన్న వార్తలపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై పరోక్షంగా విమర్శలు చేశారు. చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. గంటకుపైగా చర్చలు జరపడంతో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదురబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పొత్తును పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో తిట్టిన బీజేపీతో బాబు మళ్లీ కలిసి, ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆత్మహత్యే అవుతుందని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీన్ని రీట్వీట్ చేసిన గణేశ్ .. బాబు పేరు చెప్పకుండా విమర్శలు చేశారు.