మాధురి అరెస్ట్? తిరుమలలో అనుమతి లేని ఫోటోషూట్‌పై వివాదం

MLC దువా శ్రీనివాస్ సంబంధం ఉన్న మాధురి తాజాగా అరెస్టుకు గురయ్యారు. ఈ సంఘటన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే సందర్భంలో చోటుచేసుకుంది. శ్రీనివాస్ కుటుంబ సభ్యురాలైన మాధురి పుష్కరణి పక్కన మరియు ఆలయం దగ్గర అనుమతి లేకుండా ఫోటో షూట్ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. పవిత్ర క్షేత్రంలో రీల్స్ చేయడం అనుచితమని భక్తులు, అధికారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో, మాధురిపై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆచరణకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో 292, 296, 300 BNS సెక్షన్లు, అలాగే IT ఆెక్ట్ 2000, 2008 ప్రకారం కేసులు నమోదు అయ్యాయి.

దువా శ్రీనివాస్‌తో మాధురి ఉన్న సంబంధాలపై కూడా పలు ప్రశ్నలు ఉన్నాయి. ఇటీవల ఆమె ఆయనతో కలసి తిరుమలలో దర్శనం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దువా శ్రీనివాస్‌పై కూడా కొన్ని కేసులు నమోదైన నేపథ్యంలో, ఈ వ్యవహారం చాలా దూరం వెళ్లింది. తిరుమలలో మాధురి ఫోటో షూట్ ద్వారా వారి సంబంధం తెరపైకి వచ్చింది.

Also Read : ప్రజలు ఆర్టీసీకి సహకరించాలి: సజ్జనార్ సూచనలు

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.

తాజా వార్తలు