adipurush collection

ఆది పురుష్ సినిమా ప్రదర్శింపబడే ప్రతి థియేటర్ లో ఆంజనేయుడి కోసం ఓ సీటును ఖాళీగా వదిలి పెట్టనున్నారు. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటుకు హనుమంతుడు వస్తాడనే నమ్మకంతో ప్రతి థియేటర్లో సీటును ఖాళీగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రచారం సాగుతోంది. హనుమంతుడి పక్కన సీటును భారీ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఆదిపురుష్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఆది పురుష్ టిక్కెట్స్ విషయంలో రకరకాల ప్రచారం సాగుతోందని, ఇందులో భాగంగా హనుమంతుడి పక్క సీటును భారీ ధరకు అమ్ముతున్నారని చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ లేదని, అన్ని సీట్లు ఏ ధరకు విక్రయిస్తున్నారో ఆ సీటు కూడా అంతకే విక్రయిస్తున్నట్లు తెలిపింది.