ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజెపి పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని బిజెపి జాతీయ ఉప అధ్యక్షురాలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ వెల్లడించారు, పాలమూరు జిల్లాలో భారత ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడంతో జిల్లావ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓటు వేయడానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారని ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకులు లేనిపోని మాటలు చెప్పి ఓటు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాలు పద్మజ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాండురంగారెడ్డి పాల్గొన్నారు