శేరిలింగంపల్లి గచ్చిబౌలి పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ; గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీకి చెందిన బేరి రామచంద్ర యాదవ్
ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల గణన మరియు బీసీ సమస్యలపై జరిగే జాతీయ కన్వెన్షన్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. జులై 15 2023 వ తేదీన రవీంద్ర భారతి లో జరిగే జాతీయ కన్వెన్షన్ కు యువత అంతా పాల్గొనాల్సిందిగా భేరి రామచందర్ యాదవ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని బీసీ సమస్యలపై పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు కిరణ్ కుమార్, కొండల్, శ్రావణ్ కుమార్, కావటి చంద్రశేఖర్ యాదవ్, వెంకటేష్, శివ యాదవ్, మల్లేష్ తో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ యొక్క గోడపత్రికను భేరి రామచందర్ యాదవ్  ఆవిష్కరించారు.

Previous articleఅర్ధాంగితో కలిసి అమెరికా బయల్దేరిన చిరంజీవి
Next article8-7-2023 TODAY E PAPER