తనదైన విలక్షణ నటనతో తెలుగు తమిళంలో ఫాన్స్ ని సొంతం చేసుకున్న హీరో విజయ్ సేతుపతి. తాజాగా ఆయన హైదరాబాద్ లో మహారాజా సినిమా ప్రమోషన్స్ లో సందడి చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత ఆయనకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురిసిన విషయం తెలిసిందే. సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ అంటూ పలువురు పవన్ కళ్యాణ్ కు కితాబిచ్చారు. దళపతి విజయ్ వంటి తమిళ సినీ ఇండస్ట్రీ స్టార్స్ కూడా పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కష్టపడే తత్వాన్ని చాలా గౌరవిస్తానని, ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయన్నారు , కానీ ఆయన తొడ కొట్టినప్పుడు రియల్ లైఫ్ లో ఎంత మాస్ ఓ అర్థమైందంటూ పేర్కొన్నారు. ఎవరి కథలోనో ఆయన హీరో కాదని, ఆయన సొంత కథలో ఆయనే హీరో అంటూ పవన్ కళ్యాణ్ పై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్కువ ట్రోలింగ్ ఎదుర్కొంటారో వారు చాలా స్ట్రాంగ్ అని అర్థం అంటూ పేర్కొన్నారు.ప్రతిరోజు ఫోన్ మనతోనే ఉంటుంది. చుట్టూ ఉన్నవాళ్లు నా చుట్టూ ఏదో ఒక చెడ్డ విషయం పుకార్లు, ట్రోలింగ్స్ సృష్టిస్తూ ఉంటారు. మనం పట్టించుకోకున్నా మన చుట్టూ ఉన్నవారు వాటిని మనకు చూపిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే మానసిక స్థైర్యంతో ఉండాలని.. ఇలా ఎన్నో విషయాలను పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు కాబట్టి ఫైనల్ గా ఆయన ఏంటో చూపించారని విజయ్ సేతుపతి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.