సినీ నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఈ డీప్ ఫేక్ వీడియోను తయారు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఒరిజినల్ వీడియో బ్రిటీష్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ కు చెందినది. ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక వీడియోగా మార్ఫింగ్ చేశారు.  రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 465, 469, ఐటీ సెక్షన్లు 66సీ, 66ఈ ల కింద అభియోగాలు మోపారు. మరోవైపు కాజోల్, కత్రినా కైఫ్, అలియా భట్, సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా సోనూసూద్ వీడియో ఈరోజు నెట్టింట ప్రత్యక్షమయింది.