రైతు భరోసాకు గ్రీన్ సిగ్నల్…
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా, సీజన్లను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి రూ. 15,000 సాయం అందించనున్నారు. ఇది ఖరీఫ్, రబీ పంటల కోసం కేటాయించబడుతుంది. ప్రతి సీజన్‌కు రూ. 7,500 చొప్పున రైతుల ఖాతాలో దసరా నాటికి జమచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రైతులకు గుడ్ న్యూస్… Rythu Bharosa Telangana
ఇకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి, బ్యాంక్ ఖాతాల్లో విడతల వారిగా డబ్బులు జమచేసింది. ఇప్పుడు దసరాకు రైతులకు మరో శుభవార్త అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. సీజనల్ సాగుకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 7,500 అందించేందుకు నిధులను రెడీ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. ఈ పథకం ద్వారా దాదాపు రూ. 10,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా.
వ్యవసాయేతర భూములకు సాయం లేదు…
రైతు భరోసా కింద సాయం కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయేతర భూములకు ఈ పథకం వర్తించదని ఇటీవల జరిగిన సమావేశంలో తేల్చిచెప్పారు. డిజిటల్ సర్వేతో ఖచ్చితంగా పంట భూములను గుర్తించి, తదుపరి గైడ్‌లైన్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
సారాంశం: రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందించే సాయం ద్వారా వారి జీవనోపాధి మరింత మెరుగుపడనుంది. పంట సాగు, పెట్టుబడి కోసం ఈ భరోసా పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.