ఘనంగా మంత్రి కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు.. పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి లోగల కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రివర్యులు “శ్రీ కల్వకుంట్ల తారక రామారావు” గారి జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు శ్రీ అరికపూడి గాంధీ తదితర డివిజన్ ల గౌరవ కార్పొరేటర్ లతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయురారోగ్యలతో, నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుణ్ని ప్రార్దించారు. భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని కోరుకున్నారు. అనంతరం కార్పొరేటర్ గారి వార్డు కార్యాలయంలో తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినం సందర్బంగా ప్రజా టైమ్స్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు, ఎడిటర్ పోగుల రాములు గౌడ్. ఈ కార్యక్రమంలో డివిజన్ లోగల సీనియర్ నాయకులు, హాస్పిటల్ వైద్యులు, బస్తీ కమిటీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, మహిళా నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.