ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం కలిశారు. ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని సీఎంను కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంతో భేటీ అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ… సదస్సు నిర్వహణకు అనుమతిచ్చే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించామన్నారు. వివిధ దేశాల నుంచి వేలమంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు.