ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సెమీ మైథలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదలకు ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించారు. 

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ వెల్లడి కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో సంతోషం పొంగిపొర్లుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామలు దీపిక పదుకొణే, దిశా పటానీ నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.