పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాందీ: గర్వంగా ఉంది!

sherilingampally MLA Gandhi : శతవసంతాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వ ఖాతాల సంఘానికి తనను చైర్మన్ గా నియమించడం గర్వంగా ఉందని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాందీ అన్నారు. గతంలోనూ ఎంతో మంది ప్రముఖులు, మేధావులు ఈ కమిటీకి చైర్మన్ గా సేవలు అందించారన్నారు. ప్రభుత్వ ఖాతాల సంఘం ప్రారంభ సమావేశాన్ని శనివారం నిర్వహించారు.

శాసనమండలి సమావేశ మందిరంలో కమిటీ చైర్మన్ అరికెపూడి గాందీ అద్యక్షతన జరిగిన సమావేశానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, కమిటీ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డిణ గంగుల కమలాకర్, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రామారావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల, కూనం సాంబశివరావు, టి.జీవన్ రెడ్డి, బానుప్రసాద్ రావు, ఎల్.రమణ, సత్తవరి రాథొడ్, అకౌంటెంట్ మాధవి హాజరయ్యారు. కాగా పీఏసీ చైర్మన్, సభ్యులకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీఎసీ చైర్మన్ అరికెపూడి గాందీ మాట్లాడారు.

Also Read : Telangana: రేవంత్ రెడ్డి పేద పిల్లలపై కక్ష సాధింపు మంచిది కాదు

అత్యంత ప్రాధాన్యత గల ప్రభుత్వ లెక్కల కమిటీకి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేసి కమిటీ కర్తవ్యాలను సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివిద పద్దుల కింద ప్రభుత్వ వ్యయం కోసం ముంజూరు చేసిన నిధులను సక్రమంగా వెచ్చించారా లేదా ధిక వ్యయం చేశారా తదితర వాటిపై చర్చిస్తామన్నారు. ప్రజలు వివిద రూపాలలో ప్రభుత్వానికొ చేసిన మొత్తంను రాష్ట్ర అభివృద్ధి కి సంక్షేమానికి తదితర ఖాతాలపై ఆడిట్ చేస్తూ పొదుపు చర్యలు చేపడతామన్నారు.

నేటి ఆధునిక ప్రభుత్వాలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లు లాంటివి అని పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నదన్నారు. వివిద పథకాలలో క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో కమిటీ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాలన్నారు.

    ప్రభుత్వం వివిధ సందర్భాలలో చేస్తున్న వ్యయం, కాగ్ ఆడిట్ పేరు రూపంలో వివిద హెడ్ ల కింద తెలపగా వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నివేదిక కోరటం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక శాఖ ఎల్లప్పుడూ శాసన శాఖకు బాద్యత వహించాలన్నారు. 

శాసన పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ.. పీఏసీ కమిటీ చైర్మన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అత్యంత ప్రాధాన్యత గల కమిటీ. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పీఏసీ కమిటీ చైర్మన్ కు సభ్యులకి సముచిత ప్రాముఖ్యత ఉందన్నారు. నిధుల ఖర్చు జాప్యంలో నిరూపయోగమైన ఖర్చుల పై సంబందిత శాఖ అధికారులను ప్రశ్నించి వివరణ కోరే అదికారం కమిటీకి ఉందన్నారు. అనంతరం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడారు.

పీఏసీ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని కమిటీ ల మాదిరిగా కాకుండా పీఏసీ బాద్యతలు భిన్నంగా ఉంటాయన్నారు. శాసనసభ పొందిన కేటాయింపులలో ప్రతీ శాఖ ఎంత ఖర్చు పెడుతుందనే విషయాన్ని కమిటీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. నిధులను ఖర్చు చేయడంలో జరిగే అవకతవకలు లోపాలను ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సలాహాలు, సూచనలు ఇస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కి దోహదపడాల్సిందిగా సభ్యులందరినీ కోరారు.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీదర్ బాబు మాట్లాడుతీ మొదటగా కమిటీ చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పీఏసీ మినీ అసెంబ్లీ లాంటిదన్నారు. ఉభయ సభలు సంవత్సరం అంతా సమావేశాలు నిర్వహించలేవు కాబట్టి శాసనసభ కమిటీలు నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయన్నారు. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థ లో కమిటీ వ్యవస్థను సూక్ష్మ శాసనసభగా అభవిర్ణిస్తారని తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం భారతదేశంలో మొదటిసారిగా 1919లో మాంటేంగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణల సిఫార్సులు మేరకు 1921లో ప్రారంభించడం జరిగిందన్నారు.

భారత రాజ్యాంగంలోని 151(2) అదికరణం కింద సబా సమక్షంలో ఉంచిన లెక్కలు విషయాలు ఖాతాలను నిర్దేశించిన విదంగా వ్యయం చేశారా అనే విషయాన్ని కమిటీ పరిశీలిస్తుందన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. అకౌంటెంట్ మాదవి, శాసన మండలి కార్యదర్శి నరసింహ చార్యులు మాట్లాడారు. గత లెక్కలు వివరిస్తూ.. అపరిష్కృతంగా ఉన్న వివరాలను తెలియజేశారు.

FAQs:

పీఏసీ అంటే ఏమిటి? పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) అంటే ప్రభుత్వ ఖాతాలను పర్యవేక్షించే శాసన కమిటీ. ఇది ప్రభుత్వ నిధుల వినియోగంపై సమీక్షలు చేస్తుంది.

పీఏసీ యొక్క ప్రధాన బాధ్యతలు ఏమిటి? పీఏసీ ప్రధానంగా ప్రభుత్వం చేసిన ఖర్చులను పరిశీలిస్తుంది. అనుమతులు మించిన వ్యయాలు జరిగాయా లేదా, ఖర్చు సరైన విధంగా జరిగిందా అనే విషయాలు పరిశీలించడం దీని పని.

పీఏసీ చైర్మన్ ఎవరు? ప్రస్తుతం పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాందీ ఉన్నారు. ఆయన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కూడా.

పీఏసీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించబడతాయి? పీఏసీ సమావేశాలు అవసరానుసారంగా, సాధారణంగా వార్షికంగా కొన్ని సార్లు నిర్వహించబడతాయి.

పీఏసీ ఎలా పని చేస్తుంది? పీఏసీ కాగ్ (కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్) ద్వారా సమర్పించిన నివేదికలను పరిశీలిస్తుంది. ఆ నివేదికల ఆధారంగా, నిధుల వినియోగం సక్రమంగా జరిగిందా లేదా అన్నది తేలుస్తుంది.

పీఏసీకి అధికారం ఏమిటి? పీఏసీకి నిధుల ఖర్చు విషయంలో ప్రభుత్వ శాఖలను ప్రశ్నించడానికి అధికారం ఉంది. అవసరమైన సమాచారాన్ని కోరే హక్కు కూడా ఉంది.

పీఏసీ ముఖ్యంగా ఏవైనా ప్రత్యేక నిధులను పర్యవేక్షిస్తుందా? అవును, పీఏసీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ నిధులు, అభివృద్ధి నిధులు వంటి వివిధ విభాగాల్లో ఖర్చు అయిన నిధులను పర్యవేక్షిస్తుంది.

పీఏసీ సభ్యులను ఎవరూ నియమిస్తారు? పీఏసీ సభ్యులను శాసనసభలో నుండి ఎంపిక చేస్తారు. వీరు విభిన్న రాజకీయ పార్టీలకు చెందినవారే ఉంటారు.

పీఏసీ నివేదికలను ఎక్కడ చూడవచ్చు? పీఏసీ సమర్పించిన నివేదికలు సాధారణంగా శాసనసభలో ప్రదర్శించబడతాయి. జనస్వామ్యంలో భాగంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాయి.

పీఏసీ సమావేశాలకు ఎవరు హాజరవుతారు? పీఏసీ చైర్మన్, సభ్యులు, కాగ్ ప్రతినిధులు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు పీఏసీ సమావేశాలకు హాజరవుతారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.

తాజా వార్తలు