నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను ఇష్యూ చేసిందని వార్తలు వస్తున్నాయి . అతని భార్య శ్రీలక్ష్మీకి ప్రతి నెలా చెల్లించాల్సిన భరణాన్ని చెల్లించకపోవడం, కోర్డు వాదనలకు కూడా ఆయన హాజరు కాకపోవడంతో ఇలా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను ఇష్యూ చేశారనే వార్తలు వైరల్ గా మారాయి . దీనిపై పృద్విరాజ్ స్పందించారు. ప్రతి నెలా పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మీకి 8 లక్షల భరణం ఇవ్వాలని కోర్టు గతంలో సూచించింది. అయితే తాను కోర్టు చెప్పినట్టు ప్రతీ నెలా భరణం చెల్లిస్తున్నానని, ఇలాంటి వార్తలు రావడంతో హైకోర్టు వారే ఆశ్చర్యపోయారని పృధ్వి చెప్పుకొచ్చారు. ఈ అంశం కోర్టులో ఉండగా ఇలా రాస్తారా.. ? అంటూ మీడియాపై పృద్విరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటి వరకు కోర్టు చెప్పినట్టుగానూ భరణం చెల్లిస్తున్నానని, జూన్ వరకు చెల్లించానని పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు. తన మీద తప్పుడు వార్తలు రాసిన వారిని వదిలి పెట్టనని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. అయితే వైసీపీలో ఉన్న పృద్విరాజ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురంలో భారీగా ప్రచారం కూడా చేశాడు. పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇలా విజయవాడ ఫ్యామిలీ కోర్టు అరెస్ట్ వారెంట్‌ ఇచ్చారన్న రూమర్లతో వార్తల్లో నిలిచాడు. 1984లోశ్రీ లక్ష్మీతో పృథ్వీరాజ్ వివాహాం అయిన సంగతి తెలిసిందే. వీరికి ఒక కుమారుడు. కుమార్తె ఉన్నారు