టాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మించే బ్యానర్లలో ఒకటిగా మైత్రీ మూవీస్ కనిపిస్తుంది. ఒకానొక దశలో ఏ సెట్ పై చూసినా మైత్రీ వారి సినిమాలే కనిపించాయి. అలాంటి ఈ బ్యానర్ పై ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పూర్తయిన తరువాతనే మిగతా ప్రాజెక్టుల సంగతిని ఆలోచన చేద్దామని మైత్రీవారు అనుకున్నారట. 

‘పుష్ప 2’ సినిమా విడుదల తరువాత ఈ బ్యానర్ తమిళంలో నయనతార ప్రధానమైన పాత్రగా ఒక సినిమాను నిర్మించి, పాన్ ఇండియా స్థాయిలో దానిని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఆల్రెడీ ఈ కథను నయనతారకి వినిపించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని చెబుతున్నారు. 

ఈ సినిమా కోసం ఇంతవరకూ నయనతార అందుకోని పారితోషికాన్ని మైత్రీ వారు ఆఫర్ చేసినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ కథ ఏ జోనర్ కి సంబంధించినది? దర్శకుడు ఎవరు? ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే, ‘పుష్ప 2’ విడుదల కావలసిందేనట. కనుక అప్పటివరకూ వెయిట్ చేయవలసిందే.