ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్‌ను అభినందించిన కవిత, ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కూడా కవిత మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. మెగాస్టార్‌ను చూసి గర్వపడుతున్నానంటూ కామెంట్ చేశారు.