పరిధి దాటిన హైడ్రా…! (Hydra)- జిల్లాలో ఎంట్రీకి వినతులతో పరిశీలన- ORR దాటనున్న hydra Hydra Breaking : కబ్జాలు.. ఆక్రమణలకు ఎక్కడా అంతు లేకుండా పోయింది. ఖాళీ జాగా కన్పిస్తే కన్నేసి కబ్జా చేసిన వారెందరో ఉన్నారు. అదికాక ప్రకృతి సంపదను కొల్లగొట్టి విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన వారు ఉన్నారు.
అయితే సుమారు మూడు నెలల కిందట హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని లక్ష్యం ఆక్రమణల నుంచి చెరువులు, కుంటలు కాపాడడం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన ఆక్రమణలను తొలగించడం.. కాగా హైడ్రా ఇప్పటికే చిన్నా పెద్ద తేడా లేకుండా అక్రమమని తేలితే నోటీసులు ఇవ్వడం.. కూల్చి కుప్పజేస్తూ తమ పని తాము చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకూ హైదరాబాద్ గ్రేటర్ ( Hyderabad GHMC )చుట్టూ హైదరబాద్ నగరం వెలుపల ఆక్రమణలపైన మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టి అనేక కూల్చి వేతలు చేపట్టింది. ఇంకా కూల్చివేతలు సాగుతున్నాయి. అయితే హైడ్రా చర్యలను కొందరు స్వాగతిస్తున్నప్పటికీ ఏ పాపం చేయని సామాన్యులు గోస పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: గృహప్రవేశం పూర్తయ్యే లోపు.. స్మశానమైంది. హైడ్రా కూల్చివేత, బాధితుల రోదనలు
జిల్లాలోకి ఎంట్రీ…! Hydra Entry on Districts హైడ్రా కూల్చివేతల్లో ఆక్రమణలు ఉండడంతో తమ జిల్లాలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ తేవాలనే డిమాండ్ పెరిగింది. అందులో భాగంగా ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి వినతులు వెళ్లాయి. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటే హైడ్రా పరిధి మరింత పెరిగే అవకాశం ఉంది.
ఔటర్ రింగ్ రోడ్ దాటి.. దృష్టి సారిస్తే తమ పరిస్థితి ఏమిటోననే గుబులు ఆక్రమదారుల్లో మొదలైంది. ఔటర్ కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయా ప్రాంతాల్లో కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, ఆక్రమణలపై అదికారులు సర్వే చేస్తున్నట్లు తెలుస్తుంది. హైడ్రా ఓఆర్ఆర్ ( Hydra ORR) దాటితే మరెన్ని ఆక్రమణలు వెలుగు చూస్తాయో చూడాలి. హైడ్రా పరిధి పెరుగుతున్న కొద్ది అవినీతి, ఆక్రమణదారుల గుండెల్లో బెరుపు మొదలవుతుంది.