ములుగు నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అధిష్ఠించిన సీతక్కకు సొంత నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సీతక్కకు ములుగు మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లి వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ములుగు గట్టమ్మ దేవాలయం వరకు 15 కిలోమీటర్ల మేర బాణసంచా కాల్చుతూ ర్యాలీ నిర్వహించారు. 

గట్టమ్మ దర్శనం అనంతరం ఆమె మేడారం వెళ్లి జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీతక్క మంత్రి కావడంతో మేడారానికి జాతీయ హోదా వస్తుందని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.