మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు (జనవరి 9) గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న హైదరాబాద్ లో జరపాలని ప్లాన్ చేశారు. అయితే అనుమతులు లభించకపోవడంతో వాయిదా వేశారు. తాజాగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరుకు తరలించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. గుంటూరులో నంబూరు క్రాస్ రోడ్స్ కు సమీపంలో భారత్ పెట్రోల్ బంకు పక్కన గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.