Sri Chaitanya College Madapur: మాదాపూర్ లోని శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. సుమారు వంద మంది విద్యార్థులు బాధితులుగా ఉండగా, ఈ ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచాలని ప్రయత్నించింది. తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది.
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న నవతెలంగాణ విద్యార్థి శక్తి నాయకులు, కళాశాల ఎదుటకు చేరుకుని, యాజమాన్యం నిర్లక్ష్యం పై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఖాతరు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
ధర్నాలో ముఖ్యంగా పాల్గొన్న నాయకులు:
- పవన్ కుమార్ – నవతెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అద్యక్షుడు
- సాయి కిరణ్ – ఉపాధ్యక్షుడు
- సూరజ్
- వినయ్ – రాష్ట్ర కార్యదర్శి
Also Read : పరిధి దాటిన హైడ్రా…! (Hydra)- జిల్లాలో ఎంట్రీకి వినతులతో పరిశీలన.
వారు చేసిన డిమాండ్లు:
- కళాశాలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని.
- ఫుడ్ పాయిజన్ ఘటనలపై విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.