- ఆభద్రతలో రేవంత్ రెడ్డి
- పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం
- బీఆర్ఎస్ సీనియర్ రవీందర్ యాదవ్ ద్వజం
పేదల హక్కుల కోసం పోరాడే బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం ఏ విధంగా సమంజసం? ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే దాడులకు దిగడం ప్రజా పాలనా పద్ధతా? ఇలాంటి ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మంగళవారం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ ఎదరుపెట్టారు.
కేటీఆర్ కాన్వాయ్ పై దాడి
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మూసీ నిర్వాసితులను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి జరగడం సిగ్గుచేటు అని రవీందర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దాడులతో ప్రజా సమస్యలను అణచిపెట్టే ప్రయత్నం చేయడం మూర్ఖపు పని అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే బీఆర్ఎస్ ఎప్పుడు పేదల పక్షంలో ఉంటుందని, వారి అన్యాయాలను ప్రశ్నించడం తమ కర్తవ్యమని అన్నారు.
రేవంత్ రెడ్డిపై విమర్శలు
పేదల సమస్యలను విస్మరిస్తున్న రేవంత్ రెడ్డి స్వలాభం కోసం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రవీందర్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతూ, పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మూసీని ఉపయోగించి పేదలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, డిల్లీకి కప్పం ఇచ్చి కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ సమర్థిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో కాంగ్రెస్
బీఆర్ఎస్ పేదల హక్కులను కాపాడుతూ ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. అందుకే దాడులకు పాల్పడుతున్నారని రవీందర్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని, ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చడం మానుకోకపోతే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Also Read : ధర్మవరం టీడీపీ-BJP విభేదాలు: పరిటాల శ్రీరామ్ వివరణ
బీఆర్ఎస్ స్టాండ్
బీఆర్ఎస్ ఎప్పుడూ పేద ప్రజల పక్షంలోనే ఉంటుందని, పేదలకు జరిగిన అన్యాయం ఎప్పుడూ మన్నించబోమని, మరోసారి దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని రవీందర్ యాదవ్ తేల్చి చెప్పారు.