వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా  ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చడంలో ముందువరసలో ఉంటారు రోజా.  వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు. ఏఐఐసీ చైర్పర్సన్గా.. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా పని చేశారు. ఏది ఏమయినప్పటికీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు, కుంభకోణాలకు పాల్పడిన వారు జైలుకు వెళ్లడం ఖాయమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా జైలుకు వెళ్లడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సమయంలో రోజా క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ కార్యక్రమాల్లో వందల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 100 కోట్ల రూపాయల స్కామ్ చేశారని విమర్శలొచ్చాయి. క్రికెట్ కిట్లు, ఇతర స్పోర్ట్స్ పరికరాల కొనుగోలు పేరుతో కోట్ల రూపాయలు పక్క దారి పట్టించారని కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘల నేతలు అప్పట్లో మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. అంతేకాకుండా రుషికొండ ప్యాలెస్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కాక రేపుతోంది. అయిదు వందల కోట్ల రూపాయలతో లగ్జరీగా ప్యాలెస్ను నిర్మించారు. అయితే ప్యాలెస్ అవినీతిలో కూడా రోజా హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్యాలెస్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ల వద్ద రోజా ముడుపులు తీసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ డబ్బుతోనే బెంజ్  కారు కూడా కొన్నారని గుసగుసలు వినిపించాయి. కానీ అప్పుడు రోజా ఆ ఆరోపణలను కవర్ చేసే ప్రయత్నం చేశారు. తనకు బెంజ్ కారులో తిరిగాలనే కోరిక లేదని.. కేవలం తన కొడుకు కోరిక మేరకే బెంజ్ కారు కొన్నామని తెలిపారు. అది కూడా తన సొంత డబ్బులతో కారు కొన్నట్లు వివరించారు. అంతేకాకుండా రోజా పేరు చెప్పుకొని తన సోదరుడు, భర్త దందాలు చేశారని వందల కోట్లు దండుకున్నారని రోజాపై ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజులుగా చూసుకుంటే రోజాపై అవినీతి ఆరోపణలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రోజా అరెస్ట్ తప్పదా? అన్న చర్చ తెరపైకి వచ్చింది.