- పొలిటికల్ అధికారం కోసం “హైడ్రా” మా
- పార్టీల మధ్య హీట్ పుట్టిస్తున్న హైడ్రా కూల్చివేతలు
- అధికారం కోసం బి ఆర్ స్ మరియు బి జే పి కసరత్తులు
- పేదల పాలిట శాపమా లేక వరమా • రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ :- ప్రస్తుత మహానగరం లో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా కూల్చివేతల గురించి మనకు తెలుసు. కాగా ఇప్పుడు రాష్ట్రం లో హైడ్రా కూల్చివేతలు పార్టీల మధ్య మంటలు రాజేస్తున్నాయి. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా ఆ నది పరివాహక ప్రాంతంలోని రివర్ బెడ్లో ఉన్న
నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పేద కుటుంబాల్లో అశాంతికి కారణమైంది. ఏక కాలంలో మూసీ నది సుందరీకరణ ప్రోగ్రామ్, మరోవైపు అక్రమ ఆక్రమణల కూల్చివేత పనుల్లో హైడ్రా అధికారులు నిమగ్నం కావడం పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో అలజడికి కారణమైంది.
హైడ్రా వ్యవస్థపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా ద్వారా పేద కుటుంబాలకు క్లారిటీ ఇచ్చినా ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి షిఫ్టు చేయడం, సొంత పట్టాలు ఉన్నవారికి ఆర్థిక సాయం.. ఇలాంటి హామీలను ప్రభుత్వం, అధికారులు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధరా బాబు తదితర పలువురు మంత్రులు హైడ్రా విషయంలో క్లారిటీ ఇచ్చినా అధికారుల స్థాయిలో మీడియా ద్వారా వివరణ ఇచ్చినా పేద కుటుంబాలలో భరోసా ఏర్పడలేదు.
ఒకవైపు ప్రజా భవన్లో ప్రతీ వారం రెండు రోజులపాటు ప్రజావాణి జరుగుతున్నా, గాంధీ భవన్లో వారానికి ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటున్నా బాధిత కుటుంబాలకు ఇక్కడకు రాకుండా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆశ్రయించడం గమనార్హం.
అయితే ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మలచుకోడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
మూసీ నది ఒడ్డున ఉన్న పేదల ఇండ్లను కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా
బలమైన అస్త్రంగా మార్చుకోడానికి దోహదపడింది. బీజేపీ సైతం అదే రాగం అందుకున్నా బీఆర్ఎస్ తో
పోలిస్తే వెనకబడే ఉన్నది.
హైడ్రాకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.జమ్మూకశ్మీర్ ఎన్నికల తుది దశ పోలింగ్ అక్టోబర్ 5న పూర్తికానున్నందున ప్రచార పర్వం 3వ తేదీకి ముగిస్తే ఆ తర్వాత కిషన్రెడ్డి రాష్ట్రానికి రాగానే చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని బీజేపీ భావిస్తున్నది. అప్పటికల్లా పరిస్థితిని పూర్తిగా తమవైపు తిప్పుకోవాలన్నది బీఆర్ఎస్ ఉద్దేశం.
కాగా మరోవైపు హైడ్రా విషయంలో ప్రజలకు ఎంతగా క్లారిటీ ఇచ్చినా పరిస్థితి అనుకూలంగా మారకపోవడంతో ఒకటి రెండు రోజుల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
Also Read : పింక్ పవర్ రన్ ను ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి.
హైడ్రా, మూసీ బ్యూటిఫికేషన్ అంశాలను, ప్రభుత్వ లక్ష్యాన్నివివరించి బాధితులకు ప్రభుత్వం ఏ తరహాలో అండగా ఉంటుందో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారని తెలిసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ హైడ్రాను భూతంగా చూపిస్తున్నదని, పేద కుటుంబాలను ముంపు నుంచి కాపాడేందుకు మూసీ ఒడ్డు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్న అంశాన్ని మరోసారి నొక్కిచెప్పే అవకాశమున్నది. బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళనలు పెంచాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎత్తుగడలకు రేవంత్ బ్రేక్ వేయడంపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొన్నది.
FAQs:
- హైడ్రా కూల్చివేతలు ఏమిటి?
హైడ్రా కూల్చివేతలు అంటే తెలంగాణ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం. దీనిలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభావితమవుతున్నారు. - ఈ కూల్చివేతలు రాజకీయంగా ఎలా ప్రభావం చూపుతున్నాయి?
హైడ్రా కూల్చివేతలు బిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య రాజకీయ వేడి పెంచాయి. రెండు పార్టీలు దీనిని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి. - రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి వస్తారా?
అవును, ప్రజల్లో ఉన్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వివాదంపై స్పందించనున్నారు.