విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌య‌మై ఆరా తీసిన మంత్రి.. గుంటూరు కలెక్టర్‌, ఎస్‌పీ, విజయవాడ సీపీతో ఫోన్‌లో మాట్లాడారు. డబ్బు ఆశచూపి, కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీని ఆదేశించారు. ఇలాంటి ఘటనల‌పై నిఘా పెట్టాల‌ని, పున‌రావృతం కాకుండా చూడాలని కోరారు. బాధితుడు గార్లపాటి మధుబాబు ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాల‌తో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.