దేశంలో ఎక్కడ లేనంతగా ఈసారి ఏపీ ఎన్నికలు సంచలనం సృష్టించాయి.. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఈ సారి ట్రెండ్ సెట్టర్ అయ్యింది.. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుండి పోటీ చేయటమే.. ఆయన పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన దగ్గర నుండి ఎన్నికలయ్యి రిజల్ట్ వచ్చేవరకు పిఠాపురం నుండి ఎదో ఒక వార్త వచ్చేది.. అయితే పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించాటానికి వైసీపీ బడా నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. మరెన్నో విమర్శలు చేశారు..పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటూ ప్రచారాలు చేశారు.. అంతేకాదు పిఠాపురం నియోజకవర్గంలో అప్పటి అధికార పార్టీ ఓటుకు పదివేయిలు పంచుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవలేడని ఛాలెంజ్ విసిరితే మరికొందరు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడంటూ విమర్శించారు.. ఈ క్రమలోనే వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఒడిస్తానని,ఒకవేళ ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానంటూ సవాల్ విసిరాడు.. కానీ చివరికి ప్రత్యర్థుల అంచనాలు తప్పాయి.. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ కు బ్రాహ్మరథం పట్టారు.. అఖండ మెజారిటీతో గెలిపించారు.. ఆయన భారీ మెజారిటీతో గెలవటంతో ఆయనను విమర్చించిన వాళ్లంతా సైలెంట్ అయిపోయారు.. ఇక పద్మనాభం విషయానికి వస్తే ఆయన చెప్పినట్టుగానే ముద్రగడ పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్నాడు.. కాగా జూన్ 5 న మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ గడ తను సవాల్ చేసి ఓడిపోయానని ఒప్పుకున్నారు.. చెప్పినట్టే పేరు మార్చుకుంటానని ప్రకటించారు.. అన్న మాట ప్రకారం తన పేరు మార్పు కోసం గెజిట్ పబ్లికేషన్ ద్వారా అంతా రెడీ చేసి డాక్యుమెంట్స్ పంపించారు. అయితే తాజాగా అధికారికంగా ఓకే అయ్యి గెజిట్ వచ్చింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యింది.. పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్న ముద్రగడ సవాల్ లో ఓడి చివరికి తన పేరు మార్చుకున్నాడు..