గృహప్రవేశం పూర్తయ్యే లోపు..స్మశానమైంది.
-రూపాయి..రూపాయి పోగు చేసి ఇల్లు కొన్నాం
-హైడ్రా బాదితుల రోదనలు.
-అనుమతులు ఎలా ఇచ్చారు…! ఎందుకు కూలుస్తున్నారు…?
గృహప్రవేశం సంబురం ముగిసేలోపే ఇల్లు స్మశానంలా మారిపోయిందని హైడ్రా కూల్చివేతలో ఇల్లు కొల్పోయిన బాధితుల రోధనలు మిన్నంటుతున్నాయి. అక్రమ సంపాదనకు… అవినీతి సొమ్ముకు రుచి మరిగి చేసిన పాపపు పనికి సామాన్యులు బలి అవుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని సొంతింటి కలను నెరవేర్చుకునే లోపు హైడ్రా పిడుగులా పడి తమకు పుట్టెడు దుఃఖాన్ని మిగిలుస్తుందని పలువురు బాధితుల రోధనలు ఆవేదనను కలిగిస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా అమీన్ పూర్ లో చేపట్టిన కూల్చివేతల్లో సామాన్యులకు కోలుకోలేని దెబ్బను మిగులుస్తుంది. హైడ్రా అదికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చి వేయడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
Also Read: BigBoss 8: అభయ్ నవీన్ క్షమాపణలు.. మీ అభిమానానికి దగ్గరగా ఉంటా
రిజిస్ట్రేషన్ అయిన మూడు రోజులకే కూల్చివేత...
సొంతింటి కల నెరవేరిందని అనుకొని వారం క్రితమే గృహప్రవేశం చేశామని ఐదు రోజుల కిందటే రిజిస్ట్రేషన్ అయిందని.. ఆ ఇంటిని కూల్చివేశారని బాదిత కుటుంబం బోరున విలపించింది. రూపాయి… రూపాయి పోగు చేసి దాంతో పాటు బ్యాంకు లోను తీసుకొని ఇల్లు కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కు 5 లక్షలు ఫీజు చెల్లించినట్లు తెలిపారు. అయితే తాము రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు రోజులకే అది అక్రమం ఎలా అవుతుందని అటువంటప్పుడు ఎలా అనుమతి ఇచ్చారంటూ రోదించారు. అలాగే నేలమట్టం అయిన మరో ఇంటికి కూడా మామిడాకులు కూడా అలాగే ఉన్నాయి. వారం క్రితం గృహప్రవేశం అయిన ఇల్లును కోల్పోయామని గొల్లున విలపించారు.
అనుమతులు ఇచ్చిన అధికారులే... ఇప్పుడు కూల్చివేస్తున్నారని తమ ఇంటిపై 70 లక్షల బ్యాంకు రుణం కూడా ఉందని మరో కుటుంబం వాపోయారు. అన్ని కరెక్ట్ గా ఉన్నా ఎందుకు కూల్చారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా హైడ్రా చర్యలు సామాన్యులకు శాపంగా మారిందని చెప్పకతప్పదు.
FAQs:
1. హైడ్రా అధికారుల కూల్చివేత ఎందుకు జరుగుతుంది?
హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను చేపడుతున్నారు, కానీ అనుమతులు ఉన్నా, కూల్చడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
2. బాధితులు అనుమతులు పొందిన తర్వాత కూడా ఇల్లు ఎందుకు కోల్పోతున్నారు?
అనుమతులు ఉన్నా, హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల పేరిట అనుమతులను పునః పరిశీలన చేయకుండా కూల్చివేస్తున్నారు.
3. ఇల్లు కొల్పోయిన బాధితులు ఏం చేయాలి?
బాధితులు తక్షణమే హైకోర్టులో వ్యాజ్యం వేయాలని మరియు స్థానిక ప్రతినిధులను సంప్రదించాల్సిన అవసరం ఉంది.
4. హైడ్రా అధికారుల చర్యలను ఎవరూ సవాలు చేయలేరా?
హైడ్రా అధికారుల చర్యలకు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ అది చాలా సుదీర్ఘ ప్రక్రియగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.