ఆంధ్రప్రధేశ్ లో కూటమి సంచలన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్కొక్కరి బాగోతం బయటపెడతానని జెనసేనాని పవన్ కళ్యాణ్ ముందు నుంచే చెబుతున్నారు.. ఇప్పుడు ఏపీలో మాజీ మంత్రి రోజా వ్యవహారం చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన టాస్క్ మొదలు పెట్టినట్టుగా కనబడుతోంది. అన్యాయాలను , అక్తమాలను ఎదిరించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెపుతూనే ఉంటారు. రాక్షస పాలన అంతమొందించి సుపరిపాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేశారు. అనుకున్నట్టుగానే ప్రజా దీవెనలతో విజయాన్ని సాధించి అక్రమార్కుల అంతు చూడటానికి సిద్దమయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆర్‌కే రోజా అరెస్ట్ కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏపీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచూసిన సినీ నటి, మాజీ మంత్రి రోజాకు కష్టాలు పొంచి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో టూరిజం మంత్రిగా పనిచేసిన ఆమె అనేక అక్రమాలు, కుంభకోణాలకు పాల్పడినట్టు తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపిష్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై సీఐడీ విచారణకు ఆదేశించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ఈ కుంభకోణం వివరాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆటాడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి యువతను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అయితే ఈ నిధులు భారీగా దారి మళ్లాయి అనే ఆరోపణలు ఎన్నికల ముందే ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే వాటిని రోజా తీవ్రంగా వ్యతిరేకించమే కాకుండా తన దూకుడు స్వభావంతో , కించపరిచే మాటలతో ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడింది. తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ దారుణ ఓటమి చవి చూడగా కొత్తగా ఏర్పాటైన టీడీపీ, జనసేన ప్రభుత్వం ఈ ఆరోపణలపై దృష్టి సారించింది. ఎన్ని కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆడుదాం ఆంధ్ర.. సీఎం కప్ కార్యక్రమంలో సుమారుగా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు సమాచారం . ఈ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం పావులు కదుతుపున్నట్టు సమాచారం. ఇక రోజాపై 100 కోట్ల ఆరోపణలే కాకుండా తిరుమలలో టీటీడీ టికెట్ల అమ్మకాల్లో కూడా అవినీతి జరిగినట్టు , మినిస్టర్ కోటాలోని వీఐపీ, ప్రొటోకాల్ టికెట్లను భారీ రేటుకు అమ్ముకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు సినీ నటి రోజా మెడకు చుట్టుకొనే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై రోజా ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా, ఈ ఆరోపణల్లో యువ వైసీపీ నేతపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరిపై విచారణకు ఆదేశించే అవకాశం ఉందనే విషయాన్ని టీడీపీ వర్గాలు నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి