ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు.. డిప్యూటీ సీఎం తో పాటు పవన్ కు మరో నాలుగు శాఖల్ని ఏపీ సీఎం చంద్రబాబు అప్పగించారు.. కాగా అధికారం లో ఉండగానే సరిపోదు.. మనకు ఈ అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల ఋణం తీర్చుకోవాలని జనసేన ఎమ్మెల్యేల తో పవన్ కళ్యాణ్ అన్నారంటే ఆయనకు ప్రజాసేవ పట్ల ఎంత నిబద్దత ఉందో అర్థం అవుతుంది. నీతి, నిజాయితీతో ప్రజాసేవ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.. ఇక అభివృద్ధి దిశగా అడుగులు వేయటానికి పవర్ ఫుల్ శాఖలు ఎంచుకున్న పవన్ కళ్యాణ్ తన ఆశయాలను నెరవేర్చే పవర్ ఫుల్ టీం కోసం చూస్తున్నారు.. ఈ క్రమలోనే మైలవరపు కృష్ణ తేజ పేరు తెరమీదకు వచ్చింది. ఐ ఏ ఎస్ అయిన కృష్ణ తేజ తెలుగువాడు.. కానీ ప్రస్తుతం కేరలోని త్రిషూర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.. కృష్ణ తేజ ని తన పేషిలోకి తెచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఐఏఎస్ అయిన కృష్ణతేజ ఏడేళ్లలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. చిలకలూరిపేటకు చెందిన కృష్ణ తేజ 2014 సివిల్స్ పరీక్షలో 66వ ర్యాంక్ సాధించారు. ట్రైనింగ్ తర్వాత 2017 లో కేరళ క్యాడర్ లో అలిపే జిల్లా సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన డ్యూటీ ఎక్కన కొద్ది రోజుల్లోనే ఆయన పేరు మారుమ్రోగింది. 2018 లో వచ్చిన వరదలతో కేరళ రాష్ట్రం తల్లాదిళ్ళినప్పుడు అలిపే జిల్లా పై తీవ్ర ప్రభావం పడింది.. అక్కడ సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణ తేజ ఆపరేషన్ గుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మందిని 48 గంటల్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో ముఖ్య భూమిక పోషించారు.. ఇలా ఆయన మొదటి సారి ఓ ఐఏఎస్ ఆఫీసర్ గా సాధించిన మొదటి సక్సెస్ ఇది.. వరదల తర్వాత కూడా సర్వం కోల్పోయిన బాధితుల కోసం అయామ్ ఫర్ అలిపే పేస్ బుక్ క్యాంపైన్ స్టార్ట్ చేశారు.. దీనితో భారీగా సాయం అంది అక్కడి ప్రజలకు ఆసరా అయ్యేలా చేశాడు..ఆ తర్వాత కూడా అయన ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అనంతరం సబ్ కలెక్టర్ గా ట్రాన్సఫర్ పై పర్యాటక శాఖకు వెళ్ళినప్పుడు అలిపే ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారంటేనే కృష్ణ తేజ ప్రజలకు ఎంత దగ్గరయ్యాడు అనేది అర్థం అవుతుంది. పర్యాటక రంగంలో కూడా కృష్ణ తేజ తన మార్కును చూపించాడు.. మొత్తానికి తన సేవా కార్యక్రమాలతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కృష్ణ తేజ ప్రస్తుతం కేరళ లోని త్రిషూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. కాగా కృష్ణ తేజ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన పేషిలో ఆయనను పెట్టుకోవాలని చంద్రబాబుతో కూడా చర్చించారట.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను కృష్ణ తేజ నిలబెడతారని జనసైనికులు భావిస్తున్నారు..