ఇటీవల కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సురేశ్ కనుగోలు. చిన్న వయసులోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న సురేశ్ కనుగోలు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలకు వ్యూహరచన చేసి, ఆ పార్టీ గద్దెనెక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 

అయితే, మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సురేశ్ కనుగోలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించబోరని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన సేవలను హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు  తెలిపాయి.