PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తా
⌂ Home
SCAN STORY
27 November 2026, 06:29 PM · తెలంగాణPRGI: TGTEL/25/A4038Published by PJ Television Private Limited

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సొంత ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. వేములవాడ పోలీస్ స్టేషన్‌లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

ప్రాంతం: వేములవాడలో

PJNews | వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సొంత ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా శుక్రవారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు జిల్లా ఎస్పీ స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు.

వాహనదారులతో ప్రతిజ్ఞ

మద్యం మత్తులో వాహనం నడిపితే డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్పీ వివరించారు. ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా ఇతరుల కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇకపై మద్యం సేవించి వాహనాలు నడపబోమని, ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉంటామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.

అతివేగం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వైద్య సహాయం

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. జిల్లాలోని ఏడు ఆసుపత్రుల్లో ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందవచ్చని వివరించారు.

ప్రాణాలు కాపాడితే రూ.25 వేల ప్రోత్సాహకం

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రమాదం జరిగిన తొలి గంటలో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన అర్హులైన వ్యక్తులకు రహ్‌వీర్ పథకం కింద రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు.

ప్రమాద బాధితులను చూసి వెళ్లిపోకుండా మానవత్వంతో స్పందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వేములవాడ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు ప్రేమానందం, శ్రీనివాస్, రాజు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.