ప్రాంతం: Raidurgam | Cyberabad
పీజేన్యూస్ రాయదుర్గం: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పై నుంచి కిందపడటంతో ఓ యువ టెక్నీషియన్ ప్రాణాలు కోల్పోయాడు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ SAS భవనంలో ఈ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ మరమ్మతుల పనులు చేపట్టిన ఇద్దరు టెక్నీషియన్లు అకస్మాత్తుగా పై నుంచి కిందపడిపోయారు.
ఈ ఘటనలో 19 ఏళ్ల రంగోళ్ల మనోహర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో టెక్నీషియన్ అల్లూరి వాసుకు తీవ్ర గాయాలయ్యాయి.
లిఫ్ట్ మరమ్మతుల సమయంలో జరిగిన ఈ ప్రమాదంపై మృతుడి బంధువులు ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, లిఫ్ట్ మరమ్మతుల సమయంలో తీసుకున్న భద్రతా చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.

