PJNEWSPOWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
22 November 2026, 10:12 PM · క్రైమ్THE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

నాచారంలో రూ.30 లక్షల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్!

నాచారంలో రూ.30 లక్షల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్!
నాచారంలో రూ.30 లక్షల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్!

నాచారం: హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి సరుకును మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. నాచారం పారిశ్రామికవాడలో కారును తనిఖీ చేసి 60.380 కిలోల గంజాయిగా అనుమానిస్తున్న పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించిన వివరాల ప్రకారం, నాచారం పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌తో కలిసి శనివారం అందిన పక్కా సమాచారంతో పారిశ్రామికవాడలో ఓ కారును అడ్డుకున్నారు. వాహనం డిక్కీలో నాలుగు ప్లాస్టిక్ సంచుల్లో బ్రౌన్ టేపుతో చుట్టిన 60 ప్యాకెట్లు గుర్తించారు. వాటిని పరిశీలించగా గంజాయిగా అనుమానిస్తున్న పదార్థం ఉన్నట్లు గుర్తించారు.

అరెస్టయిన వారిని ముంబైకి చెందిన డ్రైవర్ సమీర్ హసన్ అలీ షేక్ అలియాస్ రవికుమార్ చౌదరి (42), హైదరాబాద్ కింగ్‌కోఠికి చెందిన మహమ్మద్ ఖాన్ (52), కూకట్‌పల్లికి చెందిన డ్రైవర్ చందన్ కుమార్ జెనా (31)గా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం, రాహుల్ అలియాస్ కృష్ణ అనే వ్యక్తి అంతర్రాష్ట్ర గంజాయి రవాణా వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఒడిశాలో కిలోకు సుమారు రూ.2 వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్, ముంబైలో ఎక్కువ ధరకు విక్రయించేలా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.

రవాణా చేసే వారికి ఒక్కో ట్రిప్పునకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఇస్తామని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. గత వారం ఒడిశాకు వెళ్లిన ముగ్గురు సరుకును తీసుకుని నాచారం చేరుకున్న సమయంలో పోలీసులకు చిక్కినట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో రాహుల్ అలియాస్ కృష్ణ, అజయ్ సాగర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు కొనసాగుతోంది. గంజాయి సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, కొనుగోలుదారులు, రవాణా మార్గాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.