PJNEWSPOWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
23 November 2026, 07:39 AM · క్రైమ్THE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

నాచారంలో రూ.30 లక్షల గంజాయి సీజ్

నాచారంలో రూ.30 లక్షల గంజాయి సీజ్
నాచారంలో రూ.30 లక్షల గంజాయి సీజ్

PJNews /నాచారం: హైదరాబాద్ నగరంలో మత్తుపదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టును ఎస్‌ఓటీ ఉప్పల్ జోన్ మరియు నాచారం పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. మెరుపు దాడి నిర్వహించి సుమారు రూ.30 లక్షల విలువైన 60.380 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
​పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ నుంచి హైదరాబాద్‌కు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ ఉప్పల్ జోన్, నాచారం పోలీసులు నాచారం ఐడీఏలోని స్టెర్లింగ్ షూస్ కంపెనీ సమీపంలో నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా వస్తున్న MH01BK9751 నంబర్ గల నీలిరంగు ఫియట్ లీనియా కారును అడ్డగించి తనిఖీలు నిర్వహించగా, కారు డిక్కీలో రహస్యంగా అమర్చిన 60 ప్యాకెట్ల ఎండు గంజాయి బయటపడింది.
​పట్టుబడిన నిందితులను విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాలో కిలో గంజాయిని కేవలం రూ.2 వేల చొప్పున కొనుగోలు చేసి, దానిని హైదరాబాద్ మరియు ముంబై నగరాల్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిందితులు పథకం వేశారు. గంజాయిని ఒక చోటు నుంచి మరో చోటుకు సురక్షితంగా చేరవేసినందుకు ఒక్కో ట్రిప్‌కు నిందితులకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు కమీషన్ ఆశ చూపినట్లు దర్యాప్తులో తేలింది.
​ఈ దాడిలో పోలీసులు గంజాయితో పాటు కారు, నాలుగు మొబైల్ ఫోన్లు, గంజాయి ప్యాకింగ్‌కు ఉపయోగించిన 60 ఖాళీ టేప్ కవర్లను సీజ్ చేశారు. ఈ దందా వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారు రాహుల్ అలియాస్ కృష్ణతో పాటు మరో కీలక నిందితుడు అజయ్ సాగర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఈ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ మూలాలపై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.