POWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
17 November 2026, 08:25 PM · నగర వార్తలుTHE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

మాదాపూర్‌లో పశువైద్యశాల ప్రహరీ గోడ కూల్చివేత.. బిల్డర్ కోసమేనా? విచారణకు బీఆర్ఎస్ డిమాండ్

మాదాపూర్‌లో పశువైద్యశాల ప్రహరీ గోడ కూల్చివేత.. బిల్డర్ కోసమేనా? విచారణకు బీఆర్ఎస్ డిమాండ్
మాదాపూర్‌లో పశువైద్యశాల ప్రహరీ గోడ కూల్చివేత.. బిల్డర్ కోసమేనా? విచారణకు బీఆర్ఎస్ డిమాండ్

ప్రాంతం: Madhapur, Cyberabad

**పీజేన్యూస్ | మాదాపూర్:** హైటెక్ సిటీ డివిజన్ పరిధిలోని మాదాపూర్ గ్రామ సర్వే నంబర్ 87లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పశువైద్యశాల ప్రహరీ గోడను అధికారులు కూల్చివేయడంపై వివాదం నెలకొంది. రోడ్డు పక్కన ఉందనే కారణంతో గోడను తొలగించడంపై బీఆర్ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాదాపూర్‌లో పశువైద్యశాల ప్రహరీ గోడ కూల్చివేత.. బిల్డర్ కోసమేనా? విచారణకు బీఆర్ఎస్ డిమాండ్

1991లో అప్పటి ప్రభుత్వం నిర్మించిన ఈ పశువైద్యశాలకు చారిత్రక ప్రాధాన్యం ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంత స్థలాన్ని విజయ డెయిరీకి కేటాయించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పశువైద్యశాల వెనుక భారీ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతోందని, ఆ నిర్మాణానికి అడ్డుగా ఉందనే కారణంతోనే ప్రహరీ గోడను తొలగించారనే అనుమానాలు స్థానికుల్లో ఉన్నాయని ఆరోపించారు.

మాదాపూర్‌లో పశువైద్యశాల ప్రహరీ గోడ కూల్చివేత.. బిల్డర్ కోసమేనా? విచారణకు బీఆర్ఎస్ డిమాండ్

అధికారులు, నిర్మాణదారుల మధ్య కుమ్మక్కు జరిగిందనే అనుమానాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కూల్చివేతకు సంబంధించిన అనుమతులు, భూమి రికార్డులు, రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు ఉంటే వాటిని ప్రజల ముందుంచాలని కోరారు.

మాదాపూర్‌లో పశువైద్యశాల ప్రహరీ గోడ కూల్చివేత.. బిల్డర్ కోసమేనా? విచారణకు బీఆర్ఎస్ డిమాండ్

ప్రభుత్వ పశువైద్యశాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, కొత్త ప్రహరీ గోడ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అయితే కూల్చివేతకు గల అధికారిక కారణాలు, బిల్డర్‌తో కుమ్మక్కు ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ ఇంకా అందాల్సి ఉంది.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.