PJNEWSPOWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
24 November 2026, 08:47 AM · నగర వార్తలుTHE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

సైబరాబాద్‌లో రోజుకు 25 లక్షల వాహనాలు.. ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్రతిపాదనలు!

సైబరాబాద్‌లో రోజుకు 25 లక్షల వాహనాలు.. ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్రతిపాదనలు!
సైబరాబాద్‌లో రోజుకు 25 లక్షల వాహనాలు.. ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్రతిపాదనలు!
  • ఆసుపత్రుల ఓపీ సమయాల్లో మార్పులకు సూచనలు
  • అంబులెన్సుల రాకపోకలకు ప్రాధాన్యం ఇవ్వాలి
  • వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలి
  • ఆసుపత్రుల ప్రతినిధులతో సీపీ రమేష్ సమావేశం
సైబరాబాద్‌లో రోజుకు 25 లక్షల వాహనాలు.. ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్రతిపాదనలు!

హైదరాబాద్, నవంబర్ 23 (PJ NEWS): సైబరాబాద్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసు శాఖ వైద్యరంగ సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. సైబరాబాద్ మూవ్స్ 2026లో భాగంగా సోమవారం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో ‘హాస్పిటల్ హెడ్స్ కనెక్ట్’ సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ ఆసుపత్రుల అధిపతులు, వైద్యరంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

సైబరాబాద్ పరిధిలో రోజుకు దాదాపు 25 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ప్రతిరోజూ మరో 2,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని SCSC సీఈఓ నవీద్ ఆలం ఖాన్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా సాధారణ ప్రయాణికులతో పాటు అంబులెన్సులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

సైబరాబాద్‌లో రోజుకు 25 లక్షల వాహనాలు.. ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్రతిపాదనలు!

కేవలం రహదారుల విస్తరణతోనే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని సీపీ రమేష్ అన్నారు. అత్యవసర వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సంస్థల పని వేళల్లో మార్పులు, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు అవసరమని సూచించారు.

రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ఆసుపత్రుల ఓపీ సమయాలను ఉదయం ముందుగానే ప్రారంభించడం, విడతలవారీగా అపాయింట్‌మెంట్లు ఇవ్వడం, సాధ్యమైన మేరకు వారాంతాల్లో వైద్య సేవలు అందించడం వంటి ప్రతిపాదనలు సమావేశంలో చర్చకు వచ్చాయి.

రోగులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ప్రజా రవాణాను వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. వారానికి ఒకరోజు ‘గ్రీన్ సైబరాబాద్ డే’ నిర్వహించడం, కార్‌పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించడం, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ మార్షల్స్‌ను నియమించడం వంటి అంశాలపైనా చర్చించారు.

హైదరాబాద్‌లో ప్రతి వారం సుమారు ఐదుగురు పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని శ్రీనివాస్ ఆలవిల్లి తెలిపారు. పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి SCSC హెల్త్ కౌన్సిల్‌లో ఆసుపత్రుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ప్రతిపాదించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీలు డా. ఎస్. రవికుమార్, శేషాద్రిణి రెడ్డి, శేరిలింగంపల్లి డీసీపీ ఛ. శ్రీనివాస్, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, అడ్మిన్ డీసీపీ డా. టి. అన్నపూర్ణ, ఏఐజీ ఆసుపత్రుల డా. విశ్వనాథ్ గెల్లా తదితరులు పాల్గొన్నారు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.