PJNEWSPOWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
26 November 2026, 09:18 PM · నగర వార్తలుTHE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గింపునకు కార్పొరేట్ సంస్థల కీలక ప్రతిజ్ఞ

సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గింపునకు కార్పొరేట్ సంస్థల కీలక ప్రతిజ్ఞ
సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గింపునకు కార్పొరేట్ సంస్థల కీలక ప్రతిజ్ఞ
  • 2027 నాటికి ఉద్యోగుల ప్రయాణ వాహనాలు 10 శాతం తగ్గించడమే లక్ష్యం
  • ముందుకొచ్చిన 15కు పైగా కార్పొరేట్ సంస్థలు
  • టీ-హబ్‌లో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ ప్రారంభం
  • రవాణా వ్యవస్థకే అత్యంత ప్రాధాన్యం: సీపీ డాక్టర్ ఎం. రమేష్

PJNews | సైబరాబాద్: ఐటీ కారిడార్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు సమష్టిగా పరిష్కారం చూపేందుకు కార్పొరేట్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 2027 నాటికి ఉద్యోగుల ప్రయాణాలకు వినియోగించే వాహనాల సంఖ్యను 10 శాతం తగ్గించేందుకు 15కు పైగా కార్పొరేట్ సంస్థలు ప్రతిజ్ఞ చేశాయి. గురువారం టీ-హబ్ వేదికగా ప్రారంభమైన ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ సదస్సు ఇందుకు వేదికైంది.

తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ పోలీస్, ఎస్సీఎస్‌సీ, షిఫ్ట్ ట్రాన్స్‌పోర్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు నవంబర్ 28 వరకు కొనసాగనుంది.

సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గింపునకు కార్పొరేట్ సంస్థల కీలక ప్రతిజ్ఞ

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ కేవలం రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలోనే దాదాపు తొమ్మిది లక్షల మంది పనిచేస్తున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమానికి 113 భాగస్వామ్య సంస్థలు, వెయ్యికి పైగా రిజిస్ట్రేషన్లతో విశేష స్పందన లభించిందని తెలిపారు.

డీజీపీ డాక్టర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ప్రస్తుతం కేవలం రెండు శాతం మంది ప్రయాణికులు ప్రజా రవాణాను వినియోగిస్తుండగా, 82 శాతం మంది ప్రైవేటు రవాణాపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. కార్యాలయాలకు ప్రజా రవాణా అనుసంధానం మెరుగుపడాల్సిన అవసరముందన్నారు.

కార్‌పూలింగ్, ప్రజా రవాణా, కంపెనీల షటిల్ బస్సులు, చివరి మైలు అనుసంధానం, హైబ్రిడ్ పని విధానాలను ప్రోత్సహించడం ద్వారా వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కార్పొరేట్ సంస్థలతో డీజీపీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ నిర్ణయాలు కార్యరూపం దాల్చితే ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు ఉద్యోగుల ప్రయాణ సమయాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుంది.

సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గింపునకు కార్పొరేట్ సంస్థల కీలక ప్రతిజ్ఞ

ఎస్సీఎస్‌సీ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ‘సేఫర్ రూట్స్ టు స్కూల్స్’, ‘సేఫర్ జంక్షన్స్’ మార్గదర్శకాలను ఆవిష్కరించారు. రవాణా, రహదారి భద్రతకు సంబంధించిన పరిష్కారాలను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ‘సైబరాబాద్ మూవ్స్ లివింగ్ ల్యాబ్’ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఎస్సీఎస్‌సీ, డబ్ల్యూఆర్ఐ ఇండియా, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ సిటీస్ అండ్ రెస్పాన్సిబుల్ ఎంటర్‌ప్రైజెస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

బొగోటా, లండన్ నగరాల రవాణా అనుభవాలపై నిర్వహించిన చర్చలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రభుత్వ రవాణా సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, బొగోటా మాజీ మేయర్ ఎన్రిక్ పెనలోసా, ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ సీటీఓ శశి వర్మ పాల్గొన్నారు.

సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గింపునకు కార్పొరేట్ సంస్థల కీలక ప్రతిజ్ఞ

రాబోయే రెండు రోజుల్లో విద్యాసంస్థలు, యువత, నివాసితుల సంఘాలు, ఆతిథ్య రంగ ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నారు. సైబరాబాద్‌లో రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వివిధ వర్గాల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.