POWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
17 November 2026, 11:38 AM · నగర వార్తలుTHE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్‌పై CMC ప్రత్యేక తనిఖీలు.. పోస్టర్లు తొలగించాలని అధికారుల ఆదేశాలు!

హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్‌పై CMC ప్రత్యేక తనిఖీలు.. పోస్టర్లు తొలగించాలని అధికారుల ఆదేశాలు!
హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్‌పై CMC ప్రత్యేక తనిఖీలు.. పోస్టర్లు తొలగించాలని అధికారుల ఆదేశాలు!

సైబరాబాద్‌ను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రత్యేక చర్యలు చేపట్టింది. పది రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మియాపూర్ సర్కిల్-48 పరిధిలోని హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు.

‘పోస్టర్ ఫ్రీ సైబరాబాద్’ కార్యక్రమంపై ప్రధానంగా దృష్టిసారించిన మియాపూర్ డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఏఈ (SWM), ఎస్ఆర్‌పీ, రాంకీ బృందం ఫ్లైఓవర్ పరిసరాలను పరిశీలించింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రజా మౌలిక సదుపాయాలపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన పోస్టర్లు, గోడ ప్రకటనలను గుర్తించి తొలగించాలని ఆదేశించింది.

హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్‌పై CMC ప్రత్యేక తనిఖీలు.. పోస్టర్లు తొలగించాలని అధికారుల ఆదేశాలు!

పోస్టర్ల తొలగింపుతోనే సరిపెట్టకుండా, తిరిగి ఏర్పాటు కాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

నగర సుందరీకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అవగాహన కార్యక్రమాలు, నిరంతర తనిఖీలతో పరిశుభ్రమైన, పచ్చని, పోస్టర్ రహిత సైబరాబాద్ సాధనకు కృషి చేస్తామని CMC వెల్లడించింది.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.