POWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
16 November 2026, 08:54 PM · రాజకీయాలుTHE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

జెరిపాటి రామరాజు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

జెరిపాటి రామరాజు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
జెరిపాటి రామరాజు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ప్రాంతం: Sherilingampally, chandanagar

  • జేకే ఇన్‌ఫ్రా అధినేతకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
  • రామరాజు నివాసానికి వెళ్లి కేక్ కట్ చేయించిన ఎమ్మెల్యే గాంధీ
  • వ్యాపార రంగంలో మరింత ఎదుగుతూ సామాజిక సేవలో ముందుండాలని ఆకాంక్ష
  • వేడుకల్లో పాల్గొన్న పలువురు నాయకులు, స్థానికులు, అభిమానులు

పీజేన్యూస్ | శేరిలింగంపల్లి: జేకే ఇన్‌ఫ్రా అధినేత జెరిపాటి రామరాజు జన్మదిన వేడుకలు శేరిలింగంపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్వయంగా రామరాజు నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కేక్ కట్ చేయించి ఆత్మీయంగా అభినందించారు. వేడుకలకు స్థానిక నాయకులు, సన్నిహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో సందడి నెలకొంది.

వ్యాపారంతో పాటు ప్రజాసేవలోనూ రాణించాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ జెరిపాటి రామరాజు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జేకే ఇన్‌ఫ్రా సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

ప్రజల ఆదరాభిమానాలే నా బలం: రామరాజు

జెరిపాటి రామరాజు మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ప్రేమాభిమానాలు చూపిన నాయకులు, సన్నిహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆదరాభిమానాలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ప్రజల ఆనందం, సంక్షేమమే తన ఆకాంక్ష అని, సామాజిక సేవా కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషిస్తానని తెలిపారు.

ఈ వేడుకల్లో మరబోయిన రాజు యాదవ్, జెరిపాటి శ్రీనివాస్, అక్తర్, కాశీ వసంత్ తదితరులతో పాటు పలువురు నాయకులు, స్థానిక ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. రామరాజుకు శాలువా కప్పి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.